ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఫోన్ లో కాల్ ఫార్వార్డింగ్ సదుపాయం ఎనేబుల్ చేయడం ఎలానో తెలుసా!

national |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 03:54 PM

కొన్నిసార్లు మనం బిజీగా ఉన్నప్పుడు, వేద మన ప్రైమరీ నెంబర్ మీద ఫోన్ కాల్స్ తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఆ నెంబర్ కి వచ్చే ఫోన్ కాల్స్ ని వేరే సెకండరీ నెంబర్ కి ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు కాల్ ఫార్వార్డింగ్ సదుపాయాన్ని మీ ఫోన్లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్ వాడుతున్నప్పుడు, ఒక్కో ఫోన్ లో ఒక్కో ప్రదేశంలో కాల్ ఫార్వార్డింగ్‌కి సంబంధించిన సెట్టింగ్స్ లభిస్తుంటాయి. వాస్తవంగా అన్ని ఫోన్లలో కాస్త అటూ ఇటుగా Phone కాల్స్ చేసుకోవడానికి ఉపయోగించే అప్లికేషన్లో ఈ సెట్టింగ్స్ లభిస్తాయి. లేదా మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ కూడా వెతికి పట్టుకోవచ్చు. Settings లేదా Call Settings అనే విభాగంలోకి వెళ్లి, అక్కడ కనిపించే వివిధ ఆప్షన్లలో Call Forwarding అనే సదుపాయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సహజంగా కాల్ ఫార్వార్డింగ్‌లో నాలుగు రకాల సెట్టింగ్స్ ఉంటాయి. 1. Always Forward. అంటే మీకు వచ్చే అన్ని ఫోన్ కాల్స్ వేరే నెంబర్ కి ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2. Forward when busy. ఈ సెట్టింగ్ సెలక్ట్ చేసుకున్నప్పుడు కేవలం మీ ఫోన్ బిజీ వచ్చినప్పుడు మాత్రమే, మీకు వచ్చే కాల్ రెండో నెంబర్ కి ఫార్వర్డ్ చేయబడుతుంది. 3. Forward when unanswered. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఏదైనా కారణం చేత మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్ గా రెండో నెంబర్ కి ఆ కాల్ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఇక చివరిగా 4. Forward when unreached. మీకు నెట్వర్క్ సిగ్నల్ లభించక మీకు కాల్ చేసే వ్యక్తికి unreachable మెసేజ్ వస్తే గనక, ఆటోమేటిక్ గా మీరు స్పెసిఫై చేసిన వేరే నెంబర్ కి ఆ కాల్ ఫార్వర్డ్ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
వీటిలో కావాల్సిన సెట్టింగ్ సెలెక్ట్ చేసుకొని, మీ దగ్గర ఉండే రెండు నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఇకనుంచి మీరు కోరుకున్నట్లు కాల్ ఫార్వార్డింగ్ చేయబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com