ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 11:37 AM

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారెంటైన్ అండ్ స్టోరేజీ-పీపీక్యూఎస్, విభాగం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 175 ఖాళీలున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2020 జూన్ 12న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ppqs.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- 175


వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ- 2020 జూన్ 12


వేతనం- రూ.37,000


విద్యార్హతలు- ఎంఎస్సీ ఎంటమాలజీ, ఎంఎస్సీ నెర్మటాలజీ, ఎంఎస్సీ జూవాలజీ, ఎంఎస్సీ ప్లాంట్ ప్యాథాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ అగ్రికల్చర్


వయస్సు- పురుషులకు 35 ఏళ్లు. మహిళలు, థర్డ్ జెండర్‌కు 40ఏళ్లు ఉండాలి.


నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి: bit.ly/3cE6Xjx






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com