కట్టుకున్న భర్తే భార్య పాలిట రాక్షసునిలా తయారయ్యాడు. భార్య లెస్బియన్ అని తెలిసి కక్షతో తన ముగ్గురు స్నేహితులతో అఘాయిత్యం చేయించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇండోనేషియాలోని జకర్తాలో జెరోం అనే వ్యక్తి డాక్టర్ గా పని చేస్తున్నాడు. అతనికి సంవత్సరం క్రితం వివాహమైంది. జెరోం భార్య వాస్తవానికి స్వలింగ సంపర్కురాలు (లెస్బియన్). ఆమెకు పెళ్లికి ముందు నుంచే మరో మహిళతో సంబంధం ఉంది. ఆమెకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని సంవత్సరం నుంచి కాలం గడుపుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయింది. దీంతో తన భర్త ఆమె ఆచూకీ కనుకొని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లావని ప్రశ్నించగా తాను స్వలింగ సంపర్కురాలినని చెప్పింది. ఈ విషయం తెలిసిన జెరోం తీవ్రంగా కుమిలిపోయి తన స్నేహితులకు విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆమె జెరోం ఇంటికి వచ్చింది. తన భార్య మోసం చేసుకొని వివాహం చేసుకుందని ఆమె పై కక్ష పెంచుకున్నాడు. ఓ రోజు అతని ముగ్గురు స్నేహితులతో ఆమె పై బలవంతంగా అఘాయిత్యం చేయించాడు. అనంతరం తనను మోసం చేసినందుకు నీకి శిక్ష అని ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.