ఢిల్లీ కాల్పుల నిందితుడు పోలిసుల అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, మద్దతుదారుల ఆందోళనలో కాల్పులు జరిగాయి. కాల్పులకు పాల్పడింది షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల షారుఖ్ గా గుర్తించారు. సోమవారం జఫ్రాబాద్ ప్రాంతంలో రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి ఆందోళనకారుల మధ్య నుంచి వచ్చి మరో వైపు ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపి తిరిగి గుంపులో కలిసిపోయాడు.అతనిని గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసును తుపాకీతో గురిపెట్టి బెదిరించాడని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు.