ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెలీకాప్టర్ ప్రమాదంలో బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 04:09 PM

ప్రపంచ ప్రఖ్యాతి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కొబ్ బ్రయంట్ హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు కుమార్తె జియనా, మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. యూఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దట్టమైన మేఘాల కారణంగా కాలిఫోర్నియాలోని కలాబాసాస్ లో హెలీకాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదని లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ అలెక్స్ ప్రకటించారు. కొబ్ తన రెండు దశాబ్దాల క్రీడా జీవితంలో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరఫున ఆడి ఐదుసార్లు ఛాంపియన్ గా, 18 సార్లు ఆల్ టైమ్ స్టార్ గా నిలిచారు. 2012లో ఒలంపిక్స్ లో యూఎస్ తరఫున ఆడి రెండు స్వర్ణ పతకాలు గెలుపొందారు. కొబ్, ఆయన కుమార్తె మృతికి అభిమానులు సంతాపం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com