100' స్థానంలో '112'...యూపి సర్కార్ కీలక నిర్ణయం

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 06:46 PM
 

ఉత్తరప్రదేశే్లో అందుబాటులో ఉన్న డయల్ 100 హెల్ప్ లైన్ అత్యవసర సర్వీసులను ఈ నెల 26వ తేదీ నుంచి నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 100 స్థానంలో అత్యవసరంగా పోలీసు, అగ్నిమాపకశాఖ, అంబులెన్స్ సేవల కోసం '112' ను కొత్తగా ప్రవేశపెట్టాలని యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గతంలో పోలీసులకు అత్యవసరంగా సమాచారం అందించాలంటే 100, అగ్నిమాపక శాఖకు 101, మహిళల హెల్ప్ లైన్ 1090కు కాల్ చేయాల్సి వచ్చేంది. అక్టోబరు 26వతేదీ నుంచి కేవలం అన్ని రకాల అత్యవసర సహాయం కోసం 112 కాల్ చేస్తే చాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర హెల్ప్ లైన్ నంబరు 112ను ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 112 అత్యవసర హెల్ప్ లైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాత 100 హెల్ప్ లైన్ ను మూసివేశారు.