తుపాన్‌ అల్లకల్లోలం..6 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 03, 2019, 03:22 PM
 

దక్షిణ కొరియాను టైఫూన్‌ మిటాగ్‌ తుపాన్‌ అల్లకల్లోలం చేసింది. ఈ తుపాన్‌ తాకిడికి ఆరుగురు వ్యక్తులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఏడాదిలో టైఫూన్‌ మిటాగ్‌ 18వ సారి దక్షిణ కొరియాను తాకింది. ఈ తుపాన్‌ కారణంగా దేశంలోని దక్షిణ ప్రాంతంలో పలు ప్రదేశాల్లో భారీ వర్షం కురిసింది. కాగా తుపాన్‌ తాకిడికి ఆరుగురు మరణించారని, నలుగురు గాయపడ్డారని ఇంటీరియర్‌ అండ్‌ సేఫ్టీ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 100కు పైగా ఇళ్లు, ప్రయివేటు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. 1500 మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. 44045 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, వాటిలో 83 శాతం మేరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని కొరియా ఎలెక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ పేర్కొంది.