ఆక్ర‌మిత కాశ్మీర్‌లో భారీ భూకంపం

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 24, 2019, 10:27 PM
 

పాక్ అక్రమమిత కశ్మీర్ లో వ‌చ్చిన భారీ భూకంపం అందోళ‌న‌కు గురి చేసింది.రిక్టర్ స్కేల్ పై 6. 3 తీవ్రత గల భూకంపం రావడంతో దీని ధాటికి మీర్‌పూర్‌లో తీవ్ర విధ్వంసం జరిగింద‌ని పాక్ మీడియా చెపుతోంది. కాగా  భూకంప విధ్వంసం కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో రోడ్లు నిలువుగా చీలిపోవడంతో అందులో ప‌లు వాహనాలు పడిపోయాయి. అలాగే కార్లు, బస్సులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. . ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. చాలా చోట్ల రోడ్లు కుంగిపోయాయి. ఆ దృశ్యాలను  పాక్ మీడియా ప్ర‌సారం చేస్తూ, ప్ర‌పంచ దేశాలు ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విన్న‌వించాయి.