ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగ్నచిత్రాన్ని ఇంస్టాలో పోస్ట్ చేసిన మహిళా క్రికెటర్

international |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 05:14 PM

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నగ్న చిత్రాన్ని పంచుకుంది. దుస్తులేమీ లేకుండా వికెట్‌ కీపింగ్‌ చేస్తున్న చిత్రం పోస్ట్‌ చేసింది. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని సాహసం చేయడం గమనార్హం. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు ఆమె సొంతం. బ్యాటింగ్‌లోనూ సారాకు తిరుగులేదు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీ సేనకు ఓటమి రుచి చూపించింది ఆమే.


అతిగా ఆత్రుత చెందడం వంటి మానసిక సమస్యతో 30 ఏళ్ల సారా టేలర్‌ చాలాకాలంగా బాధపడుతోంది. దాంతోపాటు వ్యక్తిగత కారణాలో ఆమె ప్రస్తుతం ఎక్కువగా క్రికెట్‌ ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో ఈ మధ్యే జరిగిన యాషెస్‌ టీ20 సిరీస్‌ నుంచి స్వయంగా తప్పుకొంది. ఇందుకు ఆత్రుత సమస్య కారణం కాదని తెలిపింది. 2016లోనూ ఆమె విరామం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం సర్రేస్టార్స్‌ తరఫున మైదానంలో అదరగొడుతోంది సారా. తన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తోంది. మహిళల దేహానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆమెను ఉమెన్స్‌హెల్త్‌ యూకే ఆహ్వానించింది.


‘నా గురించి తెలిసిన వారెవ్వరైనా నేను కంఫర్ట్‌జోన్‌ నుంచి కాస్త బయటకు వచ్చినట్టు తెలుసుకుంటారు. అయితే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉమెన్స్‌హెల్త్‌ యూకేకు ధన్యవాదాలు. నా దేహంతో నేనెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్నింటిని అధిగమించాను. మహిళా సాధికారతను సాధించాను. చూసేందుకు ప్రతి అమ్మాయి బాగుంటుంది! దయచేసి గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అందమైందే’ అని సారా టేలర్‌ తన నగ్రచిత్రానికి వివరణ ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com