రాజకీయాల్లో సాధారణ నాయకుడిగా ఉన్నప్పుడు కాస్తంత దూకుడుగా ఉన్నా, స్థాయి పెరిగినప్పుడు, ఉన్నత పదవికి ఎంపికైనప్పుడు ఒదిగి ఉండాలి అన్నది విశ్లేషకుల మాట. అయితే ఇన్నాళ్లు ఏపీ కొత్త స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేనీ సీతారాం ఆ పదవిలో ఒదిగిపోయారా...? అన్న అనుమానాలు చాలా మందిలో ఉండేవి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు మంత్రి గా పనిచేసిన ఆయనకు రాజకీయ అనుభవం గొప్పదే. కాకపోతే, ఇప్పుడు కూర్చున్న స్థానం ఇప్పటి వరకు తన వ్యవహార సైలికి పూర్తిగా కొత్తది అనటంలో సందేహం లేదు. అయితే తొలిరోజున సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నంలో... ‘ఏయ్..’, ‘అయ్..’ అంటూ గదమాయించడం సరికాదని , సభలో సభ్యుడిగా ఎంతోమంది స్పీకర్లను చూసిన ఆయన.. తనను తాను స్పీకర్ స్థానంలో ఊహించుకుని మలచుకుంటే మంచి పేరు తెచ్చుకునే ఆస్కారం ఉందని, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఏ రాజకీయ నేతయినా సరే, స్పీకర్ స్థానంలోకి మారిన తరువాత తాను మారాలి, తనను తాను పూర్తిగా మార్చుకొనేలా కొంత హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందునా ఇంతవరకు రాజకీయాలలో దుందుడుకుగా, దూకుడుగా ఉన్న తమ్మినేని స్పీకర్ కుర్చీలో కూర్చోవటం కాస్త కష్టమైన విషయంగానే కనిపిస్తోందంటూ సభాపతిగా తొలి రోజును అనేక సార్లు సభను నియంత్రించేందుకు కష్టపడ్డా కాస్త ప్రాక్టీస్ చేయటం అత్యవసరమంటున్నారంతా.