వినియోగదారులకు విద్యుత్ షాక్ తగలనుంది. నవంబరు నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. 15 నెలలుపాటు ఈ బాదుడు కొనసాగనుంది. విద్యుత్ చార్జీలు పెంచకూడదని కూటమి ప్రభుత్వం భావించినా.. పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. వినియోగదారులు ఇప్పటికే విద్యుత్ వినియోగదారులు సర్దుబాటు చార్జీలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి మరో రూ.6,072.86 కోట్లు వసూలు చేసేందుకు డిస్కంలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఇటీవల అనుమతులిచ్చింది.
దీంతో వినియోగదారుల నుంచి ఈ బిల్లలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధపడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు సర్దుబాటు చార్జీలను 15 నెలల పాటు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే 2026 జనవరి వరకూ విద్యుత్ చార్జీలతోపాటు అదనపు బాదుడు తప్పదు. దీంతో వినియోగారులు ఆందోళన చెందుతున్నారు.