తూర్పు గోదావరి, రాజమహేంద్రవరం జిల్లాలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. నూతన మద్యం పాలసీ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.మద్యం ఎంఆర్‌పీ కంటే ఎక్కు వకు విక్రయించడం, బెల్టు షాపులను నిర్వహించడం వంటివి చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. సారాకు సంబంధిం చి ఇప్పటి వరకూ 25 చోట్ల సోదాలు చేసి 24 మందిపై కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేశామన్నారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న 11,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి వాహనాలను సీజ్ చేశామన్నారు.
నల్ల జర్ల, గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం తో ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేశార న్నారు. 23 మందిని అరెస్టు చేసి 43.39 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో మంగురువారం రాత్రి ఎక్సైజ్ అధికారులు దాడిచేసి 6 బీరు సీసాలు స్వాదీనం చేసుకున్నట్టు కొవ్వూరు ఎక్సయిజ్ సీఐ జి. సత్యనారాయణ తెలిపారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో ఒక వ్యక్తిని అరెస్టుచేసి 6 క్వార్టర్ ఆఫీసర్స్ చాయిస్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒకసారి కేసు నమోదైన తర్వాత భవిష్యత్తులో పునరావృతమైతే మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరించారు. అక్రమాలపై ప్రజ లు టోల్ ఫ్రీ నెంబర్ 70932 73981కి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచిం చారు. అవసరమైతే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.