బాణసంచాను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని భీమవరం పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. జిల్లా అధికారులు దీనిపై ప్రకటన చేశారు. వ్యాపారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాని, భీమవరం పట్టణంలో ఇవేమీ పనిచేయలేదు. వర్తకులు పన్ను చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు వచ్చాయి. భీమవరంలో పన్ను చెల్లించని విషయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్ నాగరాణి దృష్టికి వెళ్లింది.
దీనిపై ఆమె అందరి ఆర్డీవోలకు లిఖిత పూర్వకంగా దిశా నిర్దేశం చేశారు. పన్నులు చెల్లించి లైసెన్స్ తీసుకునేలా చూడా లని స్పష్టం చేశారు. అయినా సరే బాణసంచా వ్యాపారుల నుంచి స్పందన లేదంటూ అధికా రులు తలలు పట్టుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్రస్థాయిలోనే దీనిపై దృష్టిపెట్టారు. జాయింట్ కమిషనర్ సైతం జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అయినా ఫలితం రాలేదు. భీమవరంలో ఏటా 40 మంది వర్తకులు రిటైల్ వ్యాపారం చేస్తుం టారు. ఒక్కో వ్యాపారి రూ.15 వేల వంతున పన్ను చెల్లిస్తే సరిపోతుంది. భీమవరం సర్కిల్ పరిధిలోనూ గ్రామాల్లో వర్తకులు సైతం పన్ను చెల్లించేశారు. భీమవ రంలో వ్యాపారుల నుంచి రూ.12 లక్షల మేర వసూలు కావాలని అధికా రులు అంచనా వేస్తున్నారు. అదే ముందుగా చెల్లింపులు జరిపితే అందులో సగంతోనే సరిపో యేది. కానీ కొందరు వ్యాపారులు ధిక్కార స్వరం వినిపి స్తున్నారు. లైసెన్స్ కోసం పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. భీమవరం ఒక్కటే బాణసంచా వ్యాపారంలో పన్ను చెల్లించనట్టు ముద్రపడింది. రిటైల్ వ్యాపారులకు రెండు రోజులపాటే అవకాశం కల్పిస్తారు. కొన్ని పట్టణాల్లో ఒక్క రోజుకు మాత్రమే వ్యాపారాన్ని పరిమితం చేస్తారు. హోల్‌సేల్ వర్తకులు నెల రోజుల ముందు నుంచే దుకాణాలు తెరచుకుంటారు. పన్నులు చెల్లించేస్తుంటారు. ఇప్పటి వరకు పన్ను చెల్లింపు విషయమై సమస్య రాలేదు. తాడేపల్లిగూడెం, తణుకు నియోజక వర్గాల్లో హోల్‌సేల్ వర్తకం ఉంటుంది. పన్ను చెల్లింపు ఏనాడూ వివాదం కాలేదు. ఈ ఏడాది హోల్‌సేల్ వర్తకులతోపాటు, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పన్నులు చెల్లించేశారు. ఒక్క భీమవరంలోనే అధికారులు ఇబ్బంది పడుతు న్నారు. రెండు రోజులు వ్యాపారం సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వానికి రుసుం చెల్లించాలి. ఏటా వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించేసేవారు. బాణసంచా వ్యాపారం నుంచి ప్రభుత్వానికి రెవిన్యూ తప్పనిసరిగా రావాలని వాణిజ్య పన్నుల శాఖ ఆకాంక్షిస్తోంది. దీనిపై ఆ శాఖ చీఫ్ కమిషనర్ కలెక్టర్‌లకు సూచనలు చేస్తారు. లైసెన్స్ ఇచ్చే ముందు జీఎస్టీ చెల్లించారో లేదో చూడాలని చెబుతారు. అయితే రెవెన్యూ అధికారులు పోలీస్, అగ్నిమాపక శాఖల క్లియరెన్స్ ఉంటే లైసెన్స్‌లు ఇచ్చేస్తు న్నారు. వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ రశీదు లతో సంబంఽధం ఉండడం లేదు. ఈ సారి కలెక్టర్ లిఖిత పూర్వకంగా ఆర్డీవోలకు ఆదేశాలు జారీచేశారు. దీంతో అన్ని ప్రాంతా ల్లోనూ పన్ను చెల్లించారు. ఒక్క భీమవరం లోనూ పన్ను చెల్లింపులో తాత్సారం చేస్తున్నా రు. దీంతో అధికారులు ఇబ్బందులు పడుతు న్నారు. పన్ను వసూలు చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నారు.