క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ నాయకత్వం అవసరమని మంత్రి లోకేష్ అన్నారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. ఏఐ & మిషన్ లెర్నింగ్‌లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా సెంటర్‌ల స్థిరత్వానికి ఏడబ్ల్యూఎస్ కట్టుబడి ఉండటం.. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయన్నారు. ఏడబ్ల్యూఎస్ తదుపరి డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడబ్ల్యూఎస్ సహకారం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు ఏడబ్ల్యూఎస్ సహకారాన్ని కోరుతున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.