దేశం గర్వించదగ్గ నేతల్లో ఒకరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అక్టోబరు 31) సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించినట్టు ట్వీట్ చేశారు. భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపర్చడం కోసం ఎనలేని కృషి చేశారని కొనయాడారు. దేశ సమగ్రత కోసం ఆయన చూపిన నిబద్ధత భారతదేశ ఐక్యతకు బాటలు పరిచిందని చంద్రబాబు అభివర్ణించారు. సర్దార్ పటేల్ రగిల్చిన సంఘీభావం, స్వావలంబన అనే భావాలు నేటికీ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పేర్కొన్నారు