ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ లవర్, నటి సిమీ గరేవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 08:41 PM

దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్.. 86 ఏళ్ల రతన్ టాటా మృతిపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని సామాన్యుల నుంచి ఎంతో మంది ప్రముఖుల వరకు మీడియా, సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి, రతన్ టాటా మాజీ లవర్ సిమి గరేవాల్.. రతన్ టాటా మరణ వార్తపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రతన్ టాటా లేరు అనే విషయాన్ని వినడం భరించలేనిది అని సిమి గరేవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సిమి గరేవాల్.. రతన్ టాటా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనకు తుది వీడ్కోలు ప్రకటించారు.


రతన్ టాటా మృతిపై సిమి గరేవాల్ ట్వీట్ చేశారు. "ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా" అంటూ రతన్ టాటాతో ఉన్న ఫొటోను సిమి గరేవాల్ షేర్ చేశారు. 2011లో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సిమి గరేవాల్.. తాను రతన్ టాటాతో డేటింగ్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత తాము ఇద్దరం విడిపోయినట్లు చెప్పిన విషయం తెలిసిందే. సిమి గరేవాల్ ఓ ఇంగ్లీష్ మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం బాలీవుడ్, బెంగాలీ సహా పలు భాషల చిత్రాల్లో నటించి మెప్పించారు.


ఇక రతన్‌ టాటా కూడా వ్యక్తిగత జీవితం గురించి వివిధ సందర్భాల్లో పలు విషయాలను పంచుకున్నారు. తాను 4 సార్లు ప్రేమలో పడ్డానని.. అయితే ఆ ప్రేమలు పెళ్లికి దగ్గరగా వచ్చినా.. అది ఎప్పుడూ ఫలించలేదని పేర్కొన్నారు. అయితే క్లిష్ట పరిస్థితుల కారణంగా తన ప్రేమ పెళ్లి వరకు రాలేదని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదని వెల్లడించారు. తాను అమెరికాలో పని చేస్తున్నప్పుడు.. ప్రేమ గురించి చాలా ఆలోచించేవాడిని అని.. అయితే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోలేకపోయినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com