రాజస్థాన్ లో జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్ ఎస్. మధుసూదన్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్ర రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లా నుంచి వెన్నపూస రోసిరెడ్డి, నూరుల్ హుదా ఎంపికయ్యారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు శంకర్ నారాయణ వారిని అభినందించారు.