ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీకి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 11:42 PM

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. స్పూర్తిదాయకమైన ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి, ఆధునిక భారతదేశ రూపశిల్పి, గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రత్యేకమైన ఈ రోజున మీరు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు, నిరంతర శక్తిని పొందాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశం శాంతి, శ్రేయస్సు, ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది. శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో మీ నాయకత్వం ద్వారా భారతదేశాన్ని విశ్వ గురువుగా స్థానాన్ని తిరిగి పొందాలి. అందుకు మీరు మార్గనిర్దేశం చేస్తారని విశ్వసిస్తున్నాను. ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ సర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com