ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా రాజకీయ జీవిత ప్రయాణం ఆయనతోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 12:46 PM

తాము పార్టీని వీడుతామని వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్పష్టం చేశారు. వైయ‌స్ జగన్‌ విజన్‌ నచ్చే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, తన రాజకీయ జీవిత ప్రయాణం కూడా ఆయనతోనే అని, వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ రాజకీయాలతో ముడి పెట్టడం సరికాదని తేల్చి చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో 10 మంది పార్టీ వీడుతున్నారన్న వార్తలను ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒకరిద్దరు మినహా మిగిలిన ఎంపీలందరూ ఒకే తాటిపై ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పని చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com