ట్రెండింగ్
Epaper    English    தமிழ்

vivo T3 pro వచ్చేసింది ఫ్యూచర్స్ ఏంటంటే....?

Technology |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 09:37 PM

Vivo T3 Pro 5G: వివో గత కొంత కాలంగా టీజ్ చేస్తున్న వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే ధరలో Snapdragon 7 Gen 3 చిప్ సెట్ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈరోజు సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వివో ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 24,999 ధరతో విడుదల చేయగా 8GB + 256GB వేరియంట్ ను రూ. 26,999 ధరతో విడుదల చేసింది. వివో టి3 ప్రో స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ సెప్టెంబర్ 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.


vivo టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.49mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ మిడ్ రేంజ్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 3 తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ 870K+ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB అదనపు ర్యామ్ సపోర్ట్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ FunTouch OS 14 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 14 OS పై రన్ అవుతుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. కెమెరా విభాగంలో, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX882 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు మూడవ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియోలను 30 fps వద్ద షూట్ చేయవచ్చు మరియు సూపర్ నైట్ మోడ్ తో సూపర్ క్వాలిటీ ఫోటోలు కూడా షూట్ పొందవచ్చని వివో తెలిపింది. ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో AI ఎరేజర్ మరియు AI ఫోటో ఎన్ హెన్స్ వంటి మరిన్ని ఫీచర్లు మరియు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి.'






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com