ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:28 PM

రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామ సమీపంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, వడ్రవన్నూరు గ్రామ సమీపంలో వెలసిన అపులాపురం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం శ్రావణ మాస పూజల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయాన్నే ఆలయాల్లోని మూలవిరాట్‌లకు అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సా యంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com