ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విస్తారా ఫ్రీడమ్ సేల్,,,రూ.1578కే విమాన ప్రయాణం

business |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 09:40 PM

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా అదిరే ఆఫర్ తీసుకొచ్చింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా ఎకనామీ, ప్రీమియం ఎకనామీ, బిజినెస్ క్లాస్ మూడింటిలోనూ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ స్పెషల్ సేల్ ద్వారా విస్తారా కస్టమర్లకు దేశీయ రూట్లతో పాటు అంతర్జాతీయ నెట్‌వర్క్స్‌లోనూ తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నామని విస్తారా ఓ ప్రకటన చేసింది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


విస్తారా ఫ్రీడమ్ సేల్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 23.59 గంటల వరకు ఈ బుకింగ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా వన్-వే దేశీయ మార్గంలో కనీస విమాన టికెట్ ధర రూ. 1578 గా నిర్ణయించింది. ఇది ఎకనామీ క్లాస్‌కు వర్తిస్తుంది. అదే ప్రీమియం ఎకనామీ అయితే కనీస టికెట్ ధర రూ. 2,678 గా ఉంది. అలాగే బిజినెస్ క్లాస్ కనీస టికెట్ ధర రూ. 9,978కే అందిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్గాల్లో చూసుకుంటే టూ-వే అంటే రిటర్న్ ధరలు సైతం కలిపి ఉంటాయి. ఎకనామీ క్లాస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ కనీస ధర రూ. 11,978 గా నిర్ణయించింది. ఇక ప్రీమియం ఎకనామీ క్లాస్ ధర రూ. 13,978గా ఉండగా.. బిజినెస్ క్లాస్ ధర రూ. 46,978 గా ఉంది. ఈ ధరల్లోనే అన్ని ట్యాక్సులు ఉంటాయి. ఆగస్టు 15 వ తేదీలోపు బుక్ చేసుకుని అక్టోబర్ 31, 2024 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది.


'మన ఇండిపెండెన్స్ డే సేల్స్ సరైన సమయంలో వచ్చింది. మన కస్టమర్లను రానున్న పండగల సీజన్‌లో తమ దేశీయంగా, అంతర్జాతీయంగా టూర్ ప్లాన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ స్పెషల్ సేల్ వినియోగించుకుని పెద్ద సంఖ్యలో మన కస్టమర్లు లబ్ధిపొందుతారని భావిస్తున్నాం. ఆకర్షణీయమైన టికెట్ ధరలతో దేశంలోనే అత్యంత ఆదరణ గల ఎయిర్ లైన్స్ వరల్డ్ క్లాస్ సేవలను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాం.' అని పేర్కొన్నారు విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రాజవత్. టికెట్లు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు విస్తార్ ఎయిర్ లైన్స్ వెబ్‌సైట్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్, విస్తారా ఎయిర్‌పోర్ట్ టికెడ్ ఆఫీసులు, ఎయిర్ లైన్స్ కాల్ సెంటర్లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com