ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం రోటరీ క్లబ్‌ కి అవార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 05:42 PM

అత్యుత్తమ సేవలకు గన్నవరం రోటరీ క్లబ్‌ అవార్డులన సాధించినట్లు క్లబ్‌ అధ్యక్షుడు జాస్తి విజయభూషణ్‌కుమార్‌ తెలిపారు. వివిధ సేవా కార్యక్రమాలను గుర్తించిన రోటరీ ఇంటర్నేషనల్‌ - 3020 అవార్డులను ప్రదానం చేసిందన్నారు. మొత్తం పది అవార్డులు వచ్చాయని, గోల్డ్‌ విభాగంలో ఉత్తమ అధ్యక్షుడిగా తనకు, కార్యదర్శిగా నర్రా సీతారామారావులకు అవార్డులు వచ్చినట్లు తెలిపారు. అలాగే గోల్డ్‌ కేటగిరిలో ఉత్తమ క్లబ్‌ అవార్డు, యూత్‌ సర్వీ్‌సకు గాను డైమాండ్‌ అవార్డు, క్లబ్‌ సర్వీ్‌సకు సిల్వర్‌ అవార్డులు దక్కినట్లు చెప్పారు. పబ్లిక్‌ ఇమేజ్‌, కమ్యూనిటీ సర్వీసెస్‌, సభ్యత్వ నమోదు, బేసిక్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెప్రసీ విభాగాల్లో ప్లాటినమ్‌ అవార్డులు వచ్చాయని తెలిపారు. క్లబ్‌ ద్వారా అందించిన అత్యుత్తమ సేవలు, సభ్యులందరి సమిష్టి కృషి వల్లే ఇన్ని అవార్డులు తమ క్లబ్‌కు వచ్చినట్లుగా విజయభూషణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అధ్యక్ష కార్యదర్శులను పలువురు రోటరీయన్‌లు, గ్రామ ప్రముఖులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com