ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖతో నాకు విడతీయని బంధం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 05:40 PM

విశాఖపట్నం నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని శంఖాబ్రత బాగ్చి అన్నారు. సోమవారం సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశాఖ సీపీగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని, తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. స్వతహాగా వైద్యుడినైన తనకు జాతీయ వైద్యుల దినోత్సవం రోజునే సీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తంచేశారు. విశాఖ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 2001లో జమ్మలమడుగు ఏఎస్పీగా పనిచేస్తుండగా తనకు వివాహమైందన్నారు. ఆ సమయంలో హనీమూన్‌కు ఎక్కడకు వెళ్లాలనే చర్చ వచ్చిందని, స్నేహితులు కొందరు స్విట్జర్లాండ్‌ అని, మరికొందరు నేపాల్‌ అని సలహాలిచ్చినా, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశంలో ఉత్తమ ప్రాంతానికి తీసుకువెళతానని తన భార్యకు చెప్పి విశాఖ తీసుకువచ్చానని గుర్తుచేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com