ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిమాపక అధికారుల సమస్య తీరుస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 05:38 PM

అగ్నిమాపక సిబ్బంది కోసం నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. సోమవారం పాల కొండలోని వీరఘట్టం రోడ్డులో గల శిథిలావస్థకు చేరుకున్న అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు. అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పూర్తిగా శిథిలమైన భవనంలో ఉండలేక రేకుల షెడ్‌లో తలదా చుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లా కొండలరావు, గండి రామినాయుడు, గంటా సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com