ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైళ్ల రాకపోకలపై క్రొత్త అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 11:47 PM

సాంకేతిక కారణాలతో గతంలో నాలుగు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ వాటిని పునరుద్ధరించింది. నెంబరు. 12805 విశాఖపట్టణం - లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 23 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు, తిరిగి సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు రద్దు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పుడు దానిని పక్కన పెట్టి ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రైలుని యధాతథంగా నడుపుతామని ప్రకటించారు. నెంబరు.12806 లింగంపల్లి - విశాఖపట్టణం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని గతంలో జూన్‌ 24 నుంచి ఆగస్టు 11, సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 16వ తేదీ వరకు రద్దు చేశారు. ఇప్పుడు ఈ రైలుని ఈ నెల 26వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. నెంబరు. 17463 చెంగల్‌పట్టు - కాకినాడ పోర్టు సర్కారు ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 23 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు గతంలో రద్దు చేయగా దీనిని కూడా ఈ నెల 25 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నెంబరు.17644 కాకినాడ పోర్టు - చెంగల్‌పట్టు సర్కారు ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 24 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు రద్దు చేయగా ఇప్పుడు దీనిని ఈ నెల 26 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు డీఆర్‌ఎం ఎం రామకృష్ణ తెలిపారు. గుంటూరు మీదగా ప్రయాణిస్తున్న పలు ప్రత్యేక రైలు సర్వీసులను సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించినట్లు డీఆర్‌ఎం తెలిపారు. నెంబరు. 07609 పూర్ణ - తిరుపతి రైలుని జూలై 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు, నెంబరు. 07610 తిరుపతి - పూర్ణ రైలు జూలై 2 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. నెంబరు. 07632 నరసపూర్‌ - హైదరాబాద్‌ రైలుని జూలై 7 నఉంచి సెప్టెంబరు 29వ తేదీ వరకు, నెంబరు. 07445 కాకినాడ టౌన్‌ - లింగంపల్లి రైలుని జూలై 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు, నెంబరు. 07446 లింగంపల్లి - కాకినాడ టౌన్‌ రైలు జూలై 2 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com