ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన బుజ్జి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 05:23 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ పాయకరావుపేట ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి అభినందనలు తెలియజేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ని గెడ్డం బుజ్జి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న గెడ్డం బుజ్జికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ని కలిసి గెడ్డం బుజ్జి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట గెడ్డం చైతన్య, జగ్గన్నదొర, ఏవీ.సూర్యనారాయణ తదితరులున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com