తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు ఏ కలుగులో దాక్కున్న వారి లెక్కలు తెలుస్తామని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు చూసి తాను అమెరికా వెళ్లిపోతానని కొడాలి నాని అనలేదా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా రెచ్చిపోయిన వైసీపీ నేతలకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తగిన సమాధానం చెబుతారని అన్నారు. వైసీపీ నేత కొడాలి నాని స్వార్థానికి చాలామందిని బలి చేశారన్నారు. చరిత్ర చూడనటువంటి మెజార్టీతో ప్రజలు తనను గెలిపించిన తీరుతో చాలా మంది మూర్ఖుల కళ్లు తెరచుకున్నాయని అన్నారు.