తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం కొనసాగుతోంది. ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు, పలువురు ఉన్నతాధికారులు వస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబును కలిసేందుకు మాజీ డీ.జీ ఏ.బీ వెంకటేశ్వరరావు వచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలవగానే చంద్రబాబు నివాసం వద్ద అదనపు భద్రత పెరిగింది. సందర్శకులు, నేతల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాస ప్రాంతం సందడిగా మారింది. కాగా ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.