ఏపీలో కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నేడు ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కు సరి పెట్టారన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు బలంగా నమ్మారన్నారు. జగన్‌పై ఉన్న కేసులు, అవినాష్ రెడ్డి కేసు పైన విచారణ వేగవంతం అవుతుంది. ఏపీ వైసీపీ హయాంలో దరిద్ర పాలన సాగిందని.. అప్పులు తెచ్చి బటన్ నొక్కి అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ఈ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం వచ్చిందన్నారు. కూటమి ఆధ్వర్యంలో ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.రాజధాని అమరావతి లేకుండా మూడు రాజధానులతో డ్రామా ఆడారని.. ఎర్ర చందనం, ఇసుక, మైనింగ్ మాఫియాతో దోపిడీ చేశారని ఆది నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశాడన్నారు. చేసిన తప్పులు దిద్దుకోకుండా.. సిగ్గు లేకుండా ప్రజలపై నిందలు వేస్తాడన్నారు. రేపు అసెంబ్లీలో మేము అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేడన్నారు. తల్లి, చెల్లిని కూడా దూరం పెట్టిన ఘనుడు జగన్ అని పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా జగన్‌తో ఉండరన్నారు. వారం రోజుల్లో పులివెందులలోకూడా జగన్ ఉండబోడని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బీజేపీకి వైసీపీని దాసోహం చేయడం ఖాయమన్నారు.