ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని.. ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని.. ఆరా మస్తాన్‌ది కేవలం బెట్టింగ్‌ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను, వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ కార్యకర్తలే తరిమికొట్టారన్నారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.