కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర కార్యాలయం సాక్షిగా రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. మరో వర్గం షర్మిల వల్లే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిందని చెబుతున్నారు. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయని కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని నరహరిశెట్టి నరసింహారావు అన్నారు.