టీడీపీ అధినేత చంద్రబాబు నాయడితో పార్టీ ఎంపీలు భేటి అయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోవాలని ఆదేశించారు.