ముద్దనూరు మండలంలోని బొందలకుంటలోఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరి మంగళవారం తెలిపారు. బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ఈనెల 21వ తేదీన బొందలకుంటలో పర్యటించారు. ఈ పర్యటనలో టపాసులు పేల్చారని, దీనికి సంబంధించి గ్రామానికి చెందిన సుబ్బయ్య, ఖాదరయ్య, రామచంద్రుడు అనే ముగ్గురిపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ చార్జ్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.