బాపట్ల వైసిపి ఎంపీ నందిగం సురేష్ మీద మాజీ వాలంటీర్ బరిలో దిగుతున్నారు. చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన వాలంటీర్ కట్టా ఆనంద్ బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేశారు. గత ఐదేళ్లలో ఎంపీ సురేశ్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అతను విమర్శించాడు. ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఎంపీ దోచుకున్నారని ఆరోపించాడు. ఈ ఐదేళ్లలో అసలు ఎంపీ చీరాలకు ఐదుసార్లు కూడా రాలేదన్నారు.