కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో ఎన్నికల కోడ్ అమలుపట్ల అధికారులు నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండి నామినేషన్ల ప్రక్రియ ముగిస్తున్నప్పటికీ బుధవారం నాటికి కూడా గ్రామంలోని బస్సు షెల్టర్ వద్ద సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఏర్పాటుచేసిన శిలాఫలకానికి అధికారులు ముసుగులు వేయలేదు. శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు.