భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేసి గౌరవించారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.