ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజున తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 11:00 AM

తిరుమలలో ఈ నెల 16న శ్రీవారి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. అదే రోజున గోదా పరిణయోత్సవం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను పెద్ద జీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా ఆరోజున శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com