ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు అలంకారాలతో అమ్మవారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 11:17 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణంలోని గాయత్రిమాత ఆలయంలో అన్నపూర్ణదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం లో గాయత్రిదేవి అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు గర్రె సత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారా యణ, కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పాతాళ నాగేశ్వరస్వామి దేవస్థానం, అంకాలమ్మ దేవస్థానం, సాయిబాబా, కాళికాంబ, కనకదుర్గ దేవాలయాలలో అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. షరాఫ్‌బజారులోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 20వ వార్షిక బ్రహ్మో త్సవాల సందర్భంగా స్వామి వారు కూర్మావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com