కొమరోలు పట్టణంలో మంగళవారం స్థానిక ఎస్. బి. ఎన్. అర్. ఎం పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగింది. పాఠశాల కరస్పాండెంట్ నారాయణరెడ్డి జిడుగు రమణమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల చేత సాంప్రదాయ దుస్తులలో తెలుగు భాష ప్రాధాన్యతను వివరించారు. దేశభాషలందు తెలుగు భాష లెస్స అని కరస్పాండెంట్ నారాయణరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.