28 ఏళ్లు ఆర్మీలో ఉండి దేశానికి సేవ చేసిన తాను ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో రోటరీ క్లబ్ సభ్యత్వం తీసుకున్నానని మాజీ సుబేదార్ గౌరాబత్తుని సుబ్బారావు చెప్పారు. చీరాల మండలం జాండ్రపేటలో మంగళవారం వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు అక్కడే ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావును రోటరీ క్లబ్ అధ్యక్షుడు బట్టమోహనరావు, కార్యదర్శి సురేష్ సన్మానించారు.