ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైసూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... పది మంది దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 10:38 PM

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సమీపంలో ఓ ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. తిరుమకుడాలు, నరసిపురా మధ్య ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. బళ్లారి నుంచి వారు మైసూరు సందర్శనకు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దాంతో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జయింది. 10 మంది సంఘటన స్థలంలో ప్రాణాలు విడిచారు. అతికష్టమ్మీద మరికొందరిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడడం తెలిసిందే.SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com