ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ సభకి రాకుంటే, ఏమి ఇవ్వము, వైరల్ అవుతున్న ఆడియో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 29, 2023, 10:59 AM

సీఎం జగన్ అనంతపురం జిల్లా, నార్పలలో పర్యటించిన సంగతి తెలిసిందే. దీనికి సంభందించి వైసీపీ కార్యకర్తల సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సీఎం నార్పలకు వస్తున్నారు.. వాహనం ఏర్పాటు చేశాం.. నువ్వేమో రాకుండా ఊర్లో తిరుగుతున్నావ్.. సీఎం సభకు రాకుంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సంక్షేమ పథకాల సొమ్ము చెప్పుతో కొట్టి వసూలు చేస్తా..’’ అంటూ సత్యసాయి జిల్లా, ధర్మవరం వైసీపీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి.. రావుల చెరువు గ్రామానికి చెందిన వెంకటరాముడుని ఫోన్‌లో బెదిరించారు. తనకు ఇల్లు లేదని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయలేదని ఫోన్ చేసిన ప్రతాప్ రెడ్డికి వెంకటరాముడు తెలిపాడు. ఇల్లు లేకపోవడంతో షెడ్ వేసుకుని అందులో నివసిస్తున్నామని అన్నాడు. ఈ ప్రభుత్వంలో తనకు ఏ సాయం అందలేదని, సీఎం సభకు ఎందుకు రావాలని అని ప్రశ్నించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com