భారత దిగ్గజ బాక్సర్, ఆసియా గేమ్స్ బాక్సింగ్ ఛాంపియన్ కౌర్ సింగ్(74) మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పంజాబ్ లోని కురుక్షేత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కౌర్ సింగ్ 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించారు. ఆయనకు 1982లో అర్జున, 1983లో పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. కౌర్ సింగ్ తొలుత సైన్యంలో చేరి 1971లో పాకిస్థాన్ తో యుద్ధంలో పాల్గొన్నారు.