కేదార్నాథ్లో మంచు కురుస్తుండటంతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోన్ప్రయాగ్లో పర్యాటకులకు అనుమతి లేదు. దాదాపు 4 వేల మంది భక్తులను కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ఆలయం వద్ద పర్యాటకుల భద్రత, ఆరోగ్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు.