ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుండి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 12:23 PM
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు ( మంగళవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఉదయం 9గంటలకు స్వస్తీవాచనంతో శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ ఈఓ ఎన్‌. గీత తెలిపారు. 01న ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, 02న రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు, 03న రాత్రి 8 గంటలకు స్వామివారి తిరుకల్యాణోత్సవం (గజవాహనం) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 04న రాత్రి 8 గంటలకు రథోత్సవం, 05 ఉదయం 10 గంటలకి పూర్ణాహుతి, మధ్యాహ్నం చక్ర తీర్థం, 06న ఉదయం 9 గంటలకు స్వామివారి శతఘటాభిషేకం, మధ్యాహ్నం ఒంటి గంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు వివరించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com