కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోయే తుమ్మెద వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వింజపల్లి గ్రామంలోని సమ్మక్క సారక్క గద్దల వాగు వద్ద నుండి బొలెరో వాహనంలో గికురు శంకర్, గర్రెపల్లి శ్రావన్, గ్రామం వింజపల్లి ఇసుకను అనుమతులు లేకుండా అక్రమంగా, దొంగతనంగా తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేయడమైనది.
బస్వాపూర్ గ్రామంలోని చామంతుల తిరుపతి గ్రామం బస్వాపూర్ తన యొక్క ట్రాక్టర్లో మోయాతుమ్మెద వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా, తరలిస్తుండగా ట్రాక్టర్ పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై పి అభిలాష్ తెలిపారు.