ఐదేళ్ల కోర్సు అయిన ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (కెమెస్ట్రీ) 4వ సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు బుధవారం నుంచి వచ్చే నెల 7వరకు నిర్వహిస్తున్నట్లు పీయూ పరీక్షల నియంత్రణ విభాగం అధికారి రాజ్ కుమార్ తెలిపారు. రెగ్యులర్ తో పాటు బ్యాక్ లాక్ విద్యార్ధులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు, 2022 బ్యాచ్ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ తో పాటు సెమినార్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.