ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగదేవతపై నాగుపాము,,,,పెద్దపల్లి జిల్లో ఓదెల గ్రామంలో ఘటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 08:49 PM

పెద్దపల్లి జిల్లాల్లో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పడగవిప్పి కనిపించింది. అది చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలోని శ్రీ శంభులింగేశ్వర, అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఆలయం సమీపంలోనే ఓ పెద్ద మర్రిచెట్టు ఉంది. చెట్టు కింద నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించగా.. అక్కడకు వచ్చిన ఓ నాగు పాము 10 నిమిషాలపై పడగవిప్పి విగ్రహంపై కనిపించింది.


స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చి నాగుపామును దర్శించుకన్నారు. కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఇదంతా నాగదేవత మహిమేనంటూ భక్తులు చెబుతున్నారు. అమ్మ అనుగ్రహంతోనే నాగుపాము ఆలయానికి వచ్చి భక్తులను కటాక్షించిందని అంటున్నారు. నాగదేవత విగ్రహంపై నాగు పాము ఉన్న వీడియోను కొందరు యువకులు సెల్‌ఫోన్లలో బంధించారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


శ్రీశైలంలోనూ అద్భుత దృశ్యం..


కాగా, గత 15 రోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోనూ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ నాగుపాము శివ లింగాన్ని చుట్టూ పెనవేసుకుని భక్తులకు దర్శనమిచ్చింది. పాతాళగంగ వద్ద ఉన్న చంద్రలింగం వద్ద ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. పాము శివలింగాన్ని చుట్టుకున్న దృశ్యాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో మునిగితేలారు. అంతా ఆ శ్రీశైల మల్లన్న స్వామి మహిమేనంటూ చెప్పుకుంటున్నారు. కొంతమంది భక్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అయితే శ్రీశైలం పుణ్యక్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. దీంతో ఆలయ పరిసరాల్లోకి అప్పుడప్పుడూ పాములు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటివి వస్తుంటాయి. శివలింగాన్ని చుట్టుముట్టిన పాము కూడా అలాగే వచ్చిందని కొందరు వెల్లడించారు. అడవిలో నుంచి వచ్చిన పాము.. శివలింగాన్ని చుట్టుకోవటం మాత్రం అద్భుతమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదేలలోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకోవటం పట్ల భక్తులు పరవశించిపోతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com