పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ మంగళవారం పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళలకు రేయిన్ కోట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యమని మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో రైతు రుణమాఫీ ఒకటని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.